బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసిన సినీ సెలెబ్రిటీలపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సినీ సెలెబ్రిటీలు, యాంకర్లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత వంటి వారు కూడా పలు బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశారు.