విపరీతమైన పని ఒత్తిడి. గంటల గంటలు కుర్చీల్లో కూర్చుని కంప్యూటర్ వర్క్. అక్కడే కూర్చుని తిండి. ఇంకా కాఫీలు, అల్పాహారాలు అన్నీ అక్కడే కానించేయడం. ఇలా చేస్తే శరీరం గుల్లవుతుంది. ఇలా చేసే వాటిలో మధుమేహం కూడా వుంటుంది. దాని లక్షణాలు ఏమిటో చూద్దాం.
* త్వరగా అలసిపోవడం, నీరసం.
* శరీరం నిస్సత్తువగా మారడం.
* పనిలో ఆసక్తి లేకపోవడం.
* నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం.
* తరచూ మూత్ర విసర్జన చేయడం.
* ఎక్కువ ఆహారం తీసుకుంటున్నా శరీరం బరువు తగ్గిపోవడం.