దగ్గు, ఆయాసం తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను... (video)

మంగళవారం, 13 జులై 2021 (23:14 IST)
దృష్టిదోషంతో బాధపడేవారు భోజనంలో ఆకుకూరగానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి, దాన్ని వడకట్టి, దానిలో ఒక అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
 
తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది.
 
విరోచనాలు అధికంగా అవుతుంటే కొండగోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి త్రాగితే అవి కట్టుకుంటాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూర అన్నంతో తిన్నా విరోచనాలు తగ్గిపోతాయి.
 
దగ్గు, ఆయాసం తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదోవిధంగా... అంటే ఆహారంగానో లేక ఔషధంగానో పుచ్చుకుంటే స్వస్థత చిక్కుతుంది.
 
శరీరంలో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది. అంతేకాకుండా గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది. ఉష్ణతత్వ శరీరులకు, నిక్కాకతో బాధపడేవారికి గోంగూర పడదు. వారు ఏ రూపాన కూడా గోంగూర తినరాదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు