భోజనం చేసిన వెంటనే కొందరు ఏవేవో తినేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే కొన్నింటి జోలికి వెళ్లకూడదు. వెళితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాము. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది కనుక తీసుకోరాదు. భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి.
భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గి ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన వెంటనే మద్యం తాగితే అది శరీరానికి హానికరం, ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. భోజనానికి ముందు లేదా తర్వాత కనీసం అరగంట పాటు మద్యం సేవించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.