భర్తను బంధువులతో కలిసి చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

సెల్వి

గురువారం, 24 జులై 2025 (11:32 IST)
పల్నాడులో ఘోరం జరిగింది. భార్య, ఆమె తరపు బంధువులు భర్తని చంపి అతని ఇంటికి పార్సల్ చేసి డోర్ డెలివరీ చేశారు. భార్యాభర్తల గొడవల కారణంగా పల్నాడులో హత్య చేసి, మృతదేహాన్ని నంద్యాల్లో పడేశారు. వివరాల్లోకి వెళితే.. రమణ, రమణమ్మ నూనెపల్లె ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. 
 
రమణ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. కొన్నినెలలుగా భార్యభర్తల మధ్య తరుచూ విభేదాలు వస్తున్నాయి. రమణతో గొడవ పడి, రమణమ్మ 2 నెలల క్రితం పిడుగురాళ్ల పుట్టింటికి వెళ్లింది. రమణమ్మ కోసం మంగళవారం రమణ మద్య సేవించి పిడుగురాళ్ల వచ్చాడు. 
 
మద్యం మత్తులో రమణమ్మ బంధువులతో ఘర్షణ పడ్డాడు. బంధువులు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమణ మృతదేహాన్ని రాత్రి రాత్రే నంద్యాలలోని అతని ఇంటికి తరలించారు. 
 
అయితే మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానం వ్యక్తం చేసి.. రమణ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో హత్య జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు