భర్తపై కోపం.. నాలుకను కొరికి నమిలి మింగేసిన భార్య

సెల్వి

గురువారం, 24 జులై 2025 (11:56 IST)
Husband_wife
బీహార్‌లో భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ దారుణానికి చోటుచేసుకుంది. గయా ఖిజ్రాసరాయ్‌ పోలీస్‌స్టేషను పరిధికి చెందిన దంపతుల మధ్య చిన్న గొడవ తలెత్తింది. 
 
మాటామాటా పెరిగి ఘర్షణగా మారింది. బాధితుడు ఛోటే దాస్ తన భార్యతో వాదనకు దిగాడు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైన భార్య ఆగ్రహంతో ఊగిపోతూ భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది. భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గ్రామస్థులు సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, గాయం తీవ్రత కారణంగా, అతన్ని మళ్లీ మెరుగైన చికిత్స కోసం మగధ్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు