ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకోవడం వల్ల మీ మధుమేహం, రక్తపోటు లేదా అధిక రక్తపోటు, కొవ్వు కాలేయ ప్రమాదాన్ని తగ్గించవచ్చునని ఓ టాప్ న్యూరాలజిస్ట్ వెల్లడించారు. కాఫీ బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తుంది. కానీ కాఫీని ఎక్కువ చక్కెర లేకుండా, తక్కువ పాలతో తాగాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా తెలిపారు.
కాఫీ తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, స్ట్రోక్, ఫ్యాటీ లివర్, హైపర్‌టెన్షన్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, డిప్రెషన్, కొన్ని క్యాన్సర్‌ల రిస్క్‌లను తగ్గించుకోవచ్చు. కాఫీ తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. రోజుకు 3-5 కప్పుల కాఫీ తీసుకోవడం ఆరోగ్యకరం. అయితే కాఫీలో చక్కెర కలపడం మానుకోవాలి.
అయితే నిద్రలేమితో బాధపడేవారికి "నిద్రపోయే సమయానికి 5-6 గంటల ముందు కాఫీ తాగకుండా ఉండమని" సలహా ఇచ్చారు. అధిక స్థాయిలో యాంటీహైపెర్టెన్సివ్ పోషకాలు (అంటే విటమిన్ ఇ, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం).. ఇంకా కాఫీలోని పాలీఫెనాల్స్ వల్ల కాఫీ హైపర్‌టెన్షన్ ప్రమాదానికి కారణమవుతుందని నిపుణులు వివరించారు. తీవ్రమైన రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు కాఫీ కంటే గ్రీన్ టీని తీసుకోవచ్చు.