ఈ 5 ఉపయోగాలు తెలిస్తే పుచ్చకాయ తినకుండా వుండరు...

గురువారం, 19 మార్చి 2020 (21:05 IST)
వేసవి కాలం వచ్చిందంటే పుచ్చకాయలకు కొదవే ఉండదు. పుచ్చకాయ ఆహారంగా తీసుకోవడంతో మనిషి అలసటను దూరం చేసుకుంటాడు. దీంతోపాటు ఇందులో పలు ఔషదీయ గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుచ్చకాయను వేసవికాలపు వైద్యుడు అని కూడా పిలుస్తుంటారు. ఇందులోవున్న ఔషధ గుణాలేంటో ఓసారి తెలుసుకుందాం... 
 
తలనొప్పి : వేసవి కాలంలో తరచూ తలనొప్పి వస్తుంటుంది. వేడి కారణంగా తలనొప్పి వస్తుంటే పుచ్చకాయలోని ఎర్రటి పదార్థాన్ని రసంలా తయారు చేసుకోవాలి. ఆ రసంలో కలకండ కలుపుకుని సేవిస్తే తలనొప్పి మటుమాయమౌతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
మొటిమలు : 
వేసవి కాలం ప్రారంభం కాగానే చాలామంది యువతకు విపరీతంగా మొటిమలు, పులిపిరులు, చెమట కాయలు పుట్టుకొస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు తరచూ పుచ్చకాయను సేవిస్తుండండి. పుచ్చకాయ రసాన్ని సేవిస్తుంటే శరీరంలో పెరిగిన వేడిని తగ్గిస్తుంది. దీంతో మొటిమలు, పులిపిరులు, చెమటకాయలు మటుమాయమౌతాయి. 
 
పుల్లటి తేపులు : 
పుల్లటి తేపులు వస్తుంటే మిరియాలపొడితోపాటు నల్ల ఉప్పును కలుపుకుని పుచ్చకాయతోపాటు తింటే జీర్ణక్రియ సాఫీగా జరిగి పుల్లటి తేపులు మటుమాయమౌతాయి.  
 
అధిక రక్తపోటు : 
అధిక రక్తపోటున్నవారు వేసవి కాలంలో లభించే ఈ పుచ్చకాయలను సేవిస్తుంటే పెరిగే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు