తమలపాకులు వేసుకోనివారు తెలుసుకోవాల్సిన 9 విషయాలు

సిహెచ్

మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (23:13 IST)
తమలపాకు ఒక అద్భుతమైన ఔషధాల నిలయంగా చెబుతారు. ఇది నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. గాయాలు, దద్దుర్లు కారణంగా కలిగే నొప్పిని తగ్గించడంలో దీనిని ఉపయోగించవచ్చు. తమలపాకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
తమలపాకులు శరీరంలోని రాడికల్స్‌ను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ల శక్తిని కలిగి వుంటాయి.
తమలపాకులను నమిలి రసం మింగినప్పుడు అది శరీరంలోని అంతర్గత నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
తమలపాకులు జీవక్రియను పెంచుతాయి, రక్త ప్రసరణను ప్రేరేపిస్తాయి, విటమిన్లు- పోషకాలను గ్రహించడానికి ప్రేగులను ప్రేరేపిస్తాయి.
శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో తమలపాకులు తోడ్పడుతాయి.
తమలపాకుల్లోని అద్భుతమైన యాంటీ ఫంగల్ లక్షణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
భోజనం తర్వాత కొద్ది మొత్తంలో పాన్ ఆకులను నమలడం వల్ల పేగు ఆరోగ్యం పెరుగుతుంది.
తమలపాకులు వేసుకుంటే నోటి దుర్వాసన, పంటి నొప్పులు, చిగుళ్ల నొప్పులు, వాపులు, నోటి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తమలపాకు పొడి టైప్ 2 డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు