మెంతికూర రక్తంలోని లిపిడ్ లెవల్స్‌పై మెరుగైన ప్రభావం చూపుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ఆకులను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి తీసుకుంటే అనారోగ్యం రాకుండా ఉంటుంది. డయాబెటిస్‌ను నయం చేయడంలో బాగా పనిచేస్తుంది. మెంతి కూరలోని ఔషధ కారకాలు రక్తం గడ్డకట్టకుండా కాపాడుతాయి.