శనగలను వారానికోసారి ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
శనగల్లో పీచు ఎక్కువగా వుండటం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.
రక్తహీనత సమస్యతో బాధపడేవారు శనగలు తింటే మేలు కలుగుతుంది.
శనగలులో వున్న మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటివి బీపీని నియంత్రిస్తాయి.
అధిక బరువు తగ్గాలనుకునే వారికి శనగలు తోడ్పడుతాయి.
శనగలులో వున్న యాంటీ-ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.