అరటి తొక్కే కదాని తీసిపారేయకండి.. అలా చేస్తే ఒత్తిడి పరార్

మంగళవారం, 4 జూన్ 2019 (12:27 IST)
అరటి పండును తిని.. తొక్కే కాదాని పారేస్తుంటాం. కానీ అరటి తొక్కలో వుండే యాంటీయాక్సిడెంట్ గురించి చాలామంది తెలియకపోవచ్చు. ఇందులోని ల్యూటిన్ కళ్ళకి పోషకాలను అందిస్తుంది. అంతేగాకుండా అరటి తొక్కను బాగా కడిగి.. ఉడికించి.. ఆ నీటిని తాగినట్లైతే ఒత్తిడి మాయమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
అరటిపండు తొక్కల్లో మన భావోద్వేగాలను నియంత్రించే సెరిటోనిన్ నిల్వలు అధిక మొత్తంలో ఉంటున్నాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడి అయ్యింది. ఈ తొక్కలో ఉండే కొన్ని రసాయనస్రావాలు కంటి రెటీనా కణాల్ని పునరుజ్జీవింప చేస్తున్నాయని గుర్తించారు. సాధారణంగా మెదడులో సెరిటోనిన్ నిల్వలు తగ్గితే మనకు డిప్రెషన్ తప్పదు. ఇది తగ్గకుండా వుండాలంటే.. ఇక అరటి తొక్కలే దివ్యౌషధంగా పనిచేస్తాయట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు