పొద్దు తిరుగుడు గింజల్ని స్నాక్స్‌గా తీసుకుంటే?

సోమవారం, 11 మార్చి 2019 (15:46 IST)
సాధారణంగా మనలో ఎక్కువ మంది తీరిక వేళల్లో గానీ లేదా సాయంత్రం స్నాక్స్ తినే సమయాల్లో గానీ జంక్ ఫుడ్‌ను లేదా నూనె ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తింటుంటారు. వీటి వల్ల చేజేతులారా ఆరోగ్యాలను నాశనం చేసుకుంటుంటారు. కాగా సాయంత్ర వేళల్లో తీనే స్నాక్స్ బదులు పొద్దు తిరుగుడు గింజలను స్నాక్స్ రూపంలో తీసుకుంటే, వాటి వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి. 
 
* పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
* గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్త నాళాల్లో ఉండే కొవ్వు క‌రుగుతుంది.
* పొద్దు తిరుగుడు గింజలను రోజూ తింటే జీర్ణ‌స‌మ‌స్య‌లు తగ్గిపోతాయి. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.
* క్యాన్సర్ రాకుండా అడ్డుకునే ఎన్నో ఔషధ గుణాలు పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఉంటాయి.
 
* వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
* మానసిక సమస్యలు పోతాయి. శరీర వాపులు తగ్గుతాయి. అంతేకాకుండా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
* శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హైబీపీ కంట్రోల్ అవుతుంది. చర్మం, వెంట్రుకలకు సంరక్షణ కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు