మనం ఇష్టంగా తినే పండ్లలో పనస పండు ఒకటి. ఈ పనస పండు సంపూర్ణమైన మరియు బలవర్దకమైన ఆహారం. ఇందులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ధియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ మరియు ఫైబర్‌ను సమృద్ధిగా కలిగి ఉంది. ఇన్ని పోషక విలువలున్న పనసపండు మన ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.