పిల్లల్లో దగ్గు తగ్గటానికి ధనియాలు ఉపయోగపడతాయా?

శుక్రవారం, 21 మే 2021 (22:21 IST)
పిల్లలలో దగ్గుతో పోరాడటానికి ధనియా (కొత్తిమీర) విత్తనాలు ఉపయోగపడతాయా? అంటే అవును అంటారు నిపుణులు. సాంప్రదాయకంగా ధనియాలు లేదా కొత్తిమీర విత్తనాలు పిల్లలలో దగ్గును తగ్గించడంలో ఉపయోగపడతాయి. అయితే ఇది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. దాని యొక్క ఖచ్చితమైన చర్య విధానం తెలియదు
.
ఇక ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం... ధనియాలు దగ్గుతో పోరాడటానికి సహాయపడతాయి. ఎందుకంటే దగ్గు కఫ దోష యొక్క అసమతుల్యత కారణంగా సంభవిస్తుంది. దీని ఫలితంగా, శ్లేష్మం పేరుకుపోవడం వల్ల శ్వాస మార్గం అడ్డుకుంటుంది. ధనియాలలో ఉష్ణ తత్వం, కఫాన్ని తొలగించే లక్షణాలు ఉన్నాయి. పేరుకుపోయిన శ్లేష్మాన్ని కరిగించడానికి సహాయపడతాయి. ఫలితంగా దగ్గు నుండి ఉపశమనం ఇస్తాయి.
 
ధనియాలను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయట. ధనియాలను తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఫలితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది.
 
ధనియాల కషాయం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. ఫలితంగా హృదయ సంబంధ వ్యాధులు దూరమవుతాయి. ఈ కషాయం మహిళల్లో వచ్చే రుతుసమస్యలను దూరం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు