మందు బాబులకు క్రాఫ్ట్ బీర్ అంటే ఏమిటో తెలిసే ఉంటుంది. ఈ బీరులను పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసేది కావు. చిన్నచిన్న కంపెనీలే బీరు తాగేవారి టేస్టుకు తగ్గట్లు ట్రెడిషనల్‌గా తయారు చేసేది ఈ క్రాఫ్ట్ బీర్. పబ్బుల్లోనూ, క్లబ్బులు, ఇంటి అవసరాలకోసం దీన్ని విరివిగా వినియోగిస్తారు. కానీ ఈ విదేశాల్లో క్రాఫ్ట్ బీర్స్ వాడకం ఎక్కువ. ఇప్పుడు భారత్‌లోనూ ఆ ట్రెండ్ నడుస్తోంది.
మందుబాబుల అవసరాలను అర్థం చేసుకున్న ముంబై, పుణెల్లోని కొన్ని చిన్న బీరు పరిశ్రమలు 'క్రాఫ్ట్ బీరు' పేరుతో కొత్త రకం బీరును తయారు చేశారు. ఈ క్రాఫ్ట్ బీరులో కూడా మామూలు బీరులో వాడే మాల్ట్, హాప్స్, ఈస్ట్, నీరు ఇతర పదార్థాలను కలిపి ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులు లేకుండా సహజమైన పద్ధతిలో తయారు చేస్తున్నారు. ఈ రకంగా తయారైన ఈ క్రాఫ్ట్ బీరును తాగటం వల్ల అనారోగ్యంతో ఉన్నవారికి కూడా వారి ఆరోగ్యం చేకూరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే మామూలు బీర్‌తో పోల్చితే ఈ క్రాఫ్ట్ బీర్ ధర ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు సాధారణ బీరు కన్నా ఇది ఎక్కువ నాణ్యతతో, కృత్రిమ రుచులు కలపకుండా సహజసిద్ధంగా ఉంటుంది. దీనిలో పోషక విలువలు కూడా అధిక స్థాయిలో ఉన్నాయి. బీరు తాగితే అనారోగ్యం వస్తే.. క్రాఫ్ట్ బీరు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇది ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదు.
లెసైన్సులు పొందడం నుంచి మద్యం దుకాణాలకు పంపిణీ వరకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వీటిని అధిగమించి, క్రాఫ్ట్‌బీరుకు ప్రచారం కల్పించే పనిలో తయారీదారులు ముమ్మరంగా ఉన్నారు. సాధారణ బీరుతో పోలిస్తే క్రాఫ్ట్‌బీరు ధర కాస్త ఎక్కువేననీ, ముడిసరుకుల అధిక ధరలే ఇందుకు కారణమని తయారీదారులు వివరించారు.