నెలసరి నొప్పులు తగ్గాలంటే.. గోరు వెచ్చని పాలు తాగాల్సిందే

మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (12:32 IST)
నెలసరి నొప్పులకు క్యాల్షియం లోపం కూడా కారణమవుతుంది ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నెలసరి సమయంలో తీవ్రమైన నడుము నొప్పి వేధిస్తుంది. కాళ్లూ, చేతులూ లాగడం..  కడుపులో వికారం వంటివి తప్పవు. ఈ సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజుకు గ్లాసుడు పాలు తప్పకుండా తీసుకోవాల్సిందే అంటున్నారు గైనకాలజిస్టులు. రోజూ నిద్రించేందుకు ముందు గోరువెచ్చని ఓ గ్లాసుడు పాలను తీసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. 
 
నెలసరిలో నొప్పులు కొందరికి హార్మోన్లలో ఉండే ఇబ్బందుల వల్ల ఏర్పడుతాయి. ఫైబ్రాయిడ్లు ఉన్నా నెలసరుల సమయంలో నొప్పీ, వికారం వంటి సమస్యలూ తప్పవు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే వారిలో కూడా నెలసరి సమయంలో కడుపులో నొప్పీ, నెలసరులు సరిగా రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాగే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయక పోయినా శరీరంలో క్యాల్షియం తగ్గినా నెలసరి నొప్పులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అందుకే క్యాల్షియం పుష్కలంగా వుండే ఆహారాన్ని తీసుకోవాలి. పెరుగు, బీన్స్, బాదం పప్పులు, సాల్మన్ చేపలు వంటివి తీసుకోవడం.. సూర్యరశ్మి శరీరంపై పడేలా చేసుకుంటే నెలసరి నొప్పులను దూరం చేసుకోవచ్చుని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు