గింజ ధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తింటుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెపుతారు. అలాగే 6 ప్రసిద్ధ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే శరీరానికి పోషక విలువలను మరింగా పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాము. కలుషితాలను తొలగించడానికి బియ్యాన్ని కాసేపు నీటిలో నానబెట్టాలని చెపుతారు, బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుంది.
నీటిలో నానబెట్టిన తర్వాత ఓట్స్, క్వినోవా ఉపయోగించడం ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి పోషక విలువలు పెరుగుతాయి. పచ్చి పప్పుతో చేసిన చాట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, అందుకే చాట్ ప్రసిద్ధమైన ఆహారంగా మారింది. బాదంపప్పుతో పాటు వేరుశెనగ, వాల్‌నట్‌లను నీటిలో నానబెట్టుకుని తీసుకోవచ్చు. ఎండిన అత్తి పండ్లను, ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి.