గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసాన్ని పిండి తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయంటూ కొన్ని అపోహలు వున్నాయి. ఐతే నిమ్మకాయ రసాన్ని గోరువెచ్చని నీటిలో పిండి తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిపుణుల సలహా ప్రకారం రోజూ ఈ పానీయం తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో పెద్ద మొత్తంలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఈ పదార్ధం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.