మునక్కాయల్లో మనకు మేలు చేసే విటమిన్లు, పోషక విలువలు చాలానే ఉన్నాయి. మునక్కాయలోని ఔషధ విలువలు మన శరీరానికి ముఖ్యమైనవి. మునక్కాయల్లో కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. చిన్నపిల్లల్లో ఎదుగుదలకు మునక్కాయ బాగా ఉపయోగపడుతుంది. గర్భవతులకు మంచి ఆహారం. ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. అంతేకాదు బిడ్డ పుట్టిన తరువాత పిల్లలకు పాలు పట్టడానికి కూడా మునక్కాయలు ఎంతగానో ఉపయోగపడుతుంది.