పసుపు, తేనె, వెల్లుల్లి, అల్లం వంటల్లో వాడటం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. ఇవి శరీరానికి యాంటీ బయోటిక్‌గా ఉపయోగపడతాయి. అల్లంలో యాంటీబయోటిక్ గుణాలు బ్యాక్టిరీయా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. చిగుళ్ల ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తుంది. శ్వాస కోశ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
ఇక వెల్లుల్లి.. యాంటీఫంగల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా కలిగివుంటుంది. ఖనిజాలు, విటమిన్లు, పోషకాలతో వెల్లుల్లి నిండి ఉంటుంది. రోజు తయారు చేసుకొనే వంటకాల్లో వెల్లుల్లిని భాగం చేసుకోవడంతో పాటు ఉదయాన్నే పరగడపున రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని పాలలో ఉడకబెట్టి తీసుకోవడం మంచిది.
ఇకపోతే.. దాల్చిన చెక్క పొడిని తేనె సమపాళ్లలో తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజు చెంచా చొప్పున తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. యాంటీ మెక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు బాక్టీరియాను నశింపచేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.