వెల్లుల్లి కేన్సర్‌తో పాటు గుండెపోటును దూరం చేస్తుంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. గుండె పోటు రాకుండా ఉండాలంటే.. రోజూ నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి పాలలో మరిగించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో వుండే అజోయేన్ రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది.
అలాగే వాటిలో ఉండే అలిసిన్ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్‌గా పని చేస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశం లేకుండా చేస్తుంది. రక్తనాళాలు ముడుచుకుపోయేలా చేసే యాంజియోటెన్సిస్ అనే ప్రోటీన్‌ను అలిసిన్ అడ్డుకుని రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది.