తమలపాకులను నుదుటిపై పెట్టుకుంటే..?

బుధవారం, 10 అక్టోబరు 2018 (10:11 IST)
తలనొప్పి ఎలా వస్తుందంటే నుదురు, కణతలు, మాడు తల వెనుక భాగం నుండి వస్తుంది. కొందరికైతే తల దిమ్ముగా అనిపించడం, బరువుగా ఉండడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యను నుండి బయటపడాలంటే వీటిని తరచుగా వాడితే మంచి ఫలితం ఉంటుంది.
 
వాము బాగా మాడేలా వేయించుకుంటూ దాని నుండి వెలువడే పొగను పీల్చుకుంటే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. లవంగాలు, దాల్చినచెక్క, బాదం వీటిని చూర్ణంలా తయారుచేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నుదుటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుముఖంపడుతుంది. 
 
పాలలో కొద్దిగా శొంఠి పొడిని వేసి బాగా మరిగించుకుని కాస్త పటికబెల్లం వేసి వేడివేడి పాలను సేవిస్తే తలనొప్పి తగ్గుతుంది. లేత తమలపాకులను నుదుటిపై పెట్టుకుంటే కూడా తలనొప్పి తగ్గుతుంది. నువ్వుల నూనె, కొబ్బరి నూనెను తలకు రాసుకుని 10 నిమిషాల పాటు మర్దనా చేసుకుంటే కూడా తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు