పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరిలో కాపర్, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, జింక్, విటమిన్ బి1, బి5, బి9 తదితర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చి కొబ్బరి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి కొబ్బరిలోని పీచు పదార్థం జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది.
పిల్లలకి పచ్చికొబ్బరి, బెల్లంతో చేసిన పదార్థాలు తినిపిస్తే రక్తహీనత సమస్య రాదు. చిన్న వయసు నుంచే ఎముకలు, కండరాలు పటిష్టంగా వుండాలంటే పిల్లలకి పచ్చికొబ్బరి, బెల్లంతో చేసినవి పెట్టాలి.