రాగి పిండితో చేసే వంటకాలను రుచి చూస్తున్నారా?

మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (19:55 IST)
రాగి పిండితో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో పీచు, కొలెస్ట్రాల్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, థయామిన్, కార్బొహైడ్రేడ్ వంటి ధాతువులు పుష్కలంగా వున్నాయి. ఇందులో పీచు అధికంగా వుండటం ద్వారా డైట్‌లో రాగులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్ దరిచేరదు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 
బరువును తగ్గించుకోవాలంటే.. రాగి వంటలను వారానికి రెండు లేదా మూడు సార్లైనా తీసుకోవాలి. ఇందులోని ధాతువులు ఆకలిని తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు. క్యాల్షియం ఎముకలకు మేలు చేస్తుంది. 
 
రాగిలోని అమినో యాసిడ్లు కాలేయానికి మేలు చేస్తుంది. రక్తపోటు, హృద్రోగ వ్యాధులు, అధిక రక్తపోటును ఇవి దూరం చేస్తాయి. అందుకే వారానికి రెండు సార్లైనా రాగి దోసెలు, రాగి రొట్టెలు తీసుకోవాలి. తద్వారా బలంతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు