భారత దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని భారత్ బలంగానే ఎదుర్కొందని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 97.31శాతం మంది కోలుకున్నారని ఆదివారం వెల్లడించింది. ఇంత రికవరీ రేటు సాధించిన దేశాలు ప్రపంచంలో అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది.