కొత్తిమీరలో వున్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే.. తప్పకుండా వాడని వారు కూడా వంటల్లో వాడేస్తారు. కొత్తిమీరను కేవలం రుచి, సునాసన కోసమే కాదు.. కొత్తిమీరలోని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం... కొత్తిమీర కాలేయానికి మేలు చేస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్-బి కాంప్లెక్స్‌కు చెందిన బి1, బి2, బి3, బి5, బి6 వంటి అనేక విటమిన్లు కూడా ఎక్కువే.
కొత్తిమీర కిడ్నీ సమస్యలను సమర్థంగా నివారిస్తుంది. మెగ్నీషియమ్, జింక్ వంటి ఖనిజాలు కొత్తిమీరలో చాలా ఎక్కువే. అందుకే జుట్టు మంచి మెరుపుతో నిగనిగలాడేందుకు కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో క్యాల్షియమ్ కూడా ఎక్కువ. అందుకే అది ఎముకలను పటిష్టంగా మార్చుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.