చల్లని నీరు వద్దు... వేడి నీరే ముద్దు.. ఎందుకని?

సోమవారం, 22 ఏప్రియల్ 2019 (18:54 IST)
నీరు శరీరానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. నీరు సరిగ్గా త్రాగకపోవడం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. చల్లటి నీటి కంటే వేడి నీరు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. పరగడుపున వేడి నీళ్లు తాగితే ఆనారోగ్య సమస్యలు దరిచేరవు. ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లు తాగితే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 
 
శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు, చెడు పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. పైల్స్ ఉన్న వారు కూడా వేడి నీరు తరచుగా తాగినట్లయితే ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయాన రెండు గ్లాసుల వేడినీళ్లు తాగితే బరువు కూడా తగ్గుతారట. శరీర ఉష్ణాన్ని కూడా వేడి నీళ్లు నియంత్రణలో ఉంచుతాయి. వేడి చేసిన వారు ఇవి తాగితే మంచిది. 
 
అల్పాహారం తీసుకోవడానికి కొంత సమయం ముందు వేడి నీళ్లు తాగితే కడుపు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మెటబాలిజంని కూడా పెంచుతాయి. అధిక క్యాలరీలను తొలగించడంలో కూడా వేడి నీళ్లు సహాయపడతాయి. శ్వాస కోశ సమస్యలను కూడా నివారిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు