తెల్ల గుమ్మడికాయ రసం తాగితే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్

శనివారం, 17 ఆగస్టు 2024 (19:00 IST)
బరువు తగ్గడానికి తెల్ల గుమ్మడికాయ రసం అద్భుతంగా పనిచేస్తుందని చెపుతున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే ఈ గుమ్మడికాయ రసంలో డైటరీ ఫైబర్, మెటబాలిజం, ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ గుమ్మడి రసం గురించి తెలుసుకుందాము.
 
గుమ్మడి కాయ జ్యూస్‌లో విటమిన్లు ఎ, సి, ఇ ఉన్నాయి. ఇందులో పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
తెల్ల గుమ్మడికాయ రసం ఇంట్లోనే ఎలా తయారుచేయాలో చూద్దాము.
తెల్ల గుమ్మడికాయ తీసుకొని దానిని సగానికి కట్ చేసుకోండి. గుమ్మడికాయ చిన్న ముక్కలుగా తరగండి.
ప్రతి ముక్క నుండి పైతొక్కను తొలగించండి. గుమ్మడికాయ ముక్కలను అల్యూమినియం ఫాయిల్‌లో కప్పండి.
ఆ తర్వాత కవర్ చేసిన గుమ్మడికాయ ముక్కలను బేకింగ్ పాత్రలో ఉంచండి.
ఓవెన్‌లో పాత్రను ఉంచండి (190 డిగ్రీల సెల్సియస్‌కు ముందుగా వేడి చేయండి). తదుపరి 70 నిమిషాలు ఆవిరిపట్టండి.
ఆ తర్వాత పొయ్యి నుండి తీసి చల్లబరచండి, ఈ గుమ్మడికాయ ముక్కలు మెత్తగా, జ్యూసిగా ఉంటాయి.
అల్యూమినియం ఫాయిల్‌ను వెలికితీసి ఒక గిన్నెలో బయటకు వచ్చే రసాన్ని వడకట్టి పక్కన పెట్టుకోండి.
తాజా యాపిల్ తీసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బుకుని గుజ్జు నుండి రసాన్ని ఫిల్టర్ చేసి ఒక గిన్నెలో ఉంచండి.
రెండు రసాలను కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారంతో త్రాగండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు