అల్సర్ వ్యాధికి ఎలాంటి చికిత్సలు చేయాలి..?

శనివారం, 23 ఫిబ్రవరి 2019 (14:54 IST)
అల్సర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కాలేయ సమస్యలు తలెత్తవచ్చు. అలానే కడుపంతా ఉబ్బిపోయే జలోదరం సమస్యరావొచ్చు. దీన్నే అసైటిస్  అంటారు. ఒక్కోసారి అల్సర్ పుండు చితికిపోయి తిన్న ఆహారం పేగుల్లోకి వ్యాపిస్తుంది. దాంతో విపరీతమైన కడుపునొప్పి మొదలవుతుంది. దీన్నే పర్‌ఫోరేషన్ అంటారు. విపరీతంగా రక్తస్రావం కావడంతో పాటు ఆమాశయంలో, ప్రేగుల్లో జీర్ణాశయంలో రంధ్రాలు పడి ఈ సమస్యతో కేవలం ఒకటి రెండు రోజుల్లోనే ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు.
 
అల్సర్ల వ్యాధికి చేసే ఆయుర్వేద చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది జీర్ణరసాల అధిక ఉత్పత్తిని నియంత్రిచడం, రెండవది ఏర్పడిన అల్సర్లను మానిపోయే చికిత్స చేయడం. ఇక శోధన చికిత్సలో భాగంగా పాలకు పుండ్లను తగ్గించే శక్తి ఉండడం వలన పాలు ప్రధాన అంశంగా ఉండే క్షీరవస్తి చికిత్సలు కూడా చేయడం జరుగుతుంది. వమన చికిత్సలు, రోపణ చికిత్సలు, క్షీరవస్తి చికిత్సలతో అల్సర్ సమస్యలు శాశ్వతంగా నయమైపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు