హ్యాండ్ బ్యాగ్ ఆరోగ్యానికి హానికరం. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా కానీ ఇది నిజం. ఎక్కువ బరువు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌లను నిత్యం మోయడం వలన రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వెంట్రుకులు దెబ్బతినడం దగ్గర నుంచి తలనొప్పి కండరాల నొప్పి వంటివెన్నో వస్తాయట. బాగా బరువున్న హ్యాండ్ బ్యాగ్‌ను మోచేతికి తగిలించకోవడం మంచిది కాదు. దీనివల్ల టెండినిటిస్ లేదా టెన్నిస్ ఎల్బో వంటి వాటికి తీవ్ర గాయాలపాలయ్యే అవకాశం వుంది.
అందుకే ఒక బ్యాగులోనే అన్ని కుక్కకుండా రెండు బ్యాగ్‌లలో వస్తువులను సర్దుకుంటే హ్యాండ్ బ్యాగు బరువును సులభంగా బ్యాలెన్స్ చేయొచ్చు. బాగా బరువున్న బ్యాగును మోయడం వల్ల తీవ్రంగా తలనొప్పి వస్తుంది. భుజం లోని ట్రెపేజియన్ కండరంపై ఎక్కువ వత్తిడి పడి అది మెడ వెనుక భాగం నుంచి కపాలానికి చేరడం వల్ల కండరాలు తీవ్ర వత్తిడికి గురిఅవుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే బ్యాగ్ ఎక్కువ బరువు చూసుకోవాలి.
తరుచు బ్యాగ్‌లను ఎడమ చేతి నుండి కుడి చేతికి, కుడి చేతి నుండి ఎడమ చేతికి మారుస్తుండాలి. మనం మోసే బ్యాగ్ బరువు మన బరువులో 10 శాతం మాత్రమే వుండాలి. టాయ్ లెట్ సీటుపై కన్నా నిత్యం మనం ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్‌లో బాక్టీరియా ఎక్కువగా ఉంటుందట. హ్యాండ్ బ్యాగులో డబ్బులు పెడతాం మొబైల్స్ పెడతాం, మేకప్ కిట్ పెడతాం, ఇంకా తిండి సామాగ్రి అనవసర చెత్త అన్నీ దానిలోనే ఉంటాయి. బ్యాగ్‌ను ఎక్కడ పడితే అక్కడ పెడతాము. దీనిలోని బ్యాక్టీరియా ఇంటికి కూడా విస్తరిస్తుంది. అందుకే ఈ బ్యాగ్‌లను యాంటి బ్యాక్ వైప్స్‌తో కనీసం వారానికి ఒకసారి శుభ్రం చేయాలి.