షవర్‌లో స్నానం చేస్తున్నారా? అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్సుందట!

శనివారం, 30 జులై 2022 (19:25 IST)
షవర్‌ కారణంగా హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చల్లటి నీటితో (కోల్డ్ వాటర్ బాత్) స్నానం చేస్తే ఈ ముప్పు అధికంగా ఉంటుందని వారు చెప్తున్నారు. గుండె సమస్యలతో బాధపడేవారు చల్లటి నీటితో స్నానం చేస్తే గుండె కొట్టుకునే వేగంలో తేడాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. 
 
చల్లని నీరు శరీరానికి షాక్‌ ఇస్తుందని, దీంతో చర్మంలోని రక్తనాళాలు సంకోచించి, రక్తప్రసరణ మందగిస్తుందని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ నెమ్మదించడంతో శరీర భాగాలకు రక్తం అందించేందుకు గుండె వేగంగా పని చేయాల్సి వస్తుంది. దీంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది.
 
అందుకే షవర్‌‌తో స్నానం చేస్తే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. వేడి వాతావరణం ఉన్న సమయంలో చన్నీటి స్నానం చేస్తే ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా.. చల్లటి నీటిలో సడన్‌గా మునిగితే శరీరానికి హాని జరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. 
 
ఇంకా చల్లటి నీటితో స్నానం చేయడానికి షవర్‌తో కాకుండా బకెట్ ఉపయోగించడం మంచిది. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. స్నానాన్ని ప్రారంభించాలి. అంతే గానీ ఒకేసారి తలపై గాని, శరీరంపై గానీ చల్లని నీళ్లు పోసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు