కొలెస్ట్రాల్ జీవితానికి అవసరం. అయితే రక్తంలో అధిక స్థాయిలో ఉన్నప్పుడు ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్... కొవ్వు, కాల్షియం వంటి ఇతర పదార్ధాలతో పాటు, ధమనుల గోడలపై ఫలకాలలో పేరుకుపోతుంది. కాలక్రమేణా ఇది రక్త నాళాలకు ఇబ్బందిగా మారుతుంది. దీని ఫలితంగా స్ట్రోక్, గుండెపోటుతో సహా పలు అనారోగ్యాలకు దారితీస్తుంది. కొవ్వు, ప్రొటీన్‌లతో కూడిన పదార్థాలు అయిన లిపోప్రొటీన్‌ల ద్వారా కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతుంది.