పిల్లలు తినే చిరుతిండ్లలో ముఖ్యమైన పాత్ర వహించేవి చాక్లెట్లే. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. కొందరు పిల్లలైతే అన్నం మానేసి ఎక్కువగా వీటినే తింటుంటారు. దీంతో బరువు పెరగడం, స్థూలకాయం మొదలైన సమస్యలను ఎదుర్కుంటున్నారు.
చాక్లెట్లను ఎక్కువగా తినడంతో అవి పళ్లలో ఇరుక్కుపోయి పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. పళ్లకు అంటుకునే పదార్థాలను తీసుకున్నపుడు తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఏ పని చేసినా త్వరగా అలసిపోవడం, కళ్లుతిరగడం, ఆకలి మందగించడం, కడుపులో తిప్పడం, తరచూ ఒళ్లు నొప్పులు రావడం జరుగుతుంటుంది. ఇవే కాక కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.