వెల్లుల్లిపాయల నుంచి మొలకలు రాగానే వాటిల్లో ఇంకేమీ సారం లేదని చెత్తలో పారేస్తారు. కానీ మొలకొచ్చిన వెల్లుల్లిలో తాజా వాటికన్నా గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మరింత క్రియాశీలకంగా వుంటాయని నిపుణులు చెపుతున్నారు. లేతగా వుండే పాయలు, కాస్త ముదిరిన పాయలతో పోల్చితే ఇలా మొలకొచ్చిన పాయల్లోనే రకరకాల మెటాబొలైట్లు వున్నట్లు గుర్తించారు.
సాధారణంగా ఇలాంటి పదార్థాలు గింజల మొలకల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మొక్కలుగా మారే దశలో ఆయా మొలకలు వ్యాధుల బారిన పడకుండా ఈ మెటాబొలైట్లు రక్షిస్తాయి. దీని ఆధారంగా మొలకలొచ్చిన వెల్లుల్లిలో కనిపించే ఈ పదార్థాలు కూడా అద్భుత యాంటీ ఆక్సిడెంటల్లా పనిచేస్తాయని అంటున్నారు. అంతేకాదు... ఐదు రోజుల వెల్లుల్లి మొలకలు తాజా రెబ్బలూ లేత రెబ్బలకన్నా ఎక్కువగా గుండెకు మేలు చేస్తాయని చెబుతున్నారు.