ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం వండుతున్నారా? గంజిని పారబోస్తున్నారా? (video)

శనివారం, 2 జనవరి 2021 (16:29 IST)
Rice cooked Water
పూర్వ కాలంలో పెద్దలు గంజి కాచేవారు. ఆ గంజిని తాగే వారు. అందుకేనేమో మన తాతలు, ముత్తాతలు ఆరోగ్యంగా వున్నారు. కానీ సీన్ మారింది. ఎలక్ట్రిక్ కుక్కర్లో వండే రోజులు వచ్చేశాయి. గంజి అంటే నేటి పిల్లలకు తెలియదు. 
 
గంజిని పారపోయటం మాత్రమే చాలామంది గృహిణీలు చేస్తున్న పని. కానీ గంజి తీసుకోవడం కలిగే ప్రయోజనాలను తెలిస్తే.. ఆ గంజిని పారబోయటం చేయరు. మళ్లీ పాత రోజుల్లో వండినట్లు అన్నం వండటం మొదలెడతారు. గంజిలో అన్నం వేసుకుని, చిటికెడు ఉప్పు వేసుకుని తింటే రుచిగా వుండటమే కాదు.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవచ్చు.
 
జ్వరం వచ్చినప్పుడు తాగితే త్వరగా తగ్గిపోతుంది. చర్మాన్ని గంజి సున్నితంగా, అందంగా మార్చుతుంది. చర్మ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకాన్ని వదిలిస్తుంది. నీరసంగా వున్నప్పుడు గంజిని తాగితే ఫుల్ ఎనర్జీ లభిస్తుంది. గంజితో బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. పసిపిల్లలు, ఎదిగే పిల్లలకు రోజూ గంజిని తాగిస్తే చాలా మంచిది. వారికి సరైన పోషకాలు అందుతాయి. 
 
శరీర ఎదుగుదల కూడా బావుంటుంది. వేవిళ్లకు, విరేచనాలకు గంజిని మించిన దివ్యౌషధం లేదు. కాబట్టి కుక్కర్ అన్నం వండటానికి బదులు గంజి వార్చేలా అన్నం వండితే చాలా మంచిది. గంజిని ఇంటిల్లిపాది తాగితే ఆరోగ్యం మీ సొంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు సెలవిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు