వివిధ విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన పండు రేగు పండు. ఇది రక్త ప్రవాహం, శరీర హార్మోన్లు, జుట్టు, ఎముకలు, చర్మం, కండరాలు, శరీర ఎంజైములు మరియు న్యూరోట్రాన్స్మిటర్స్ ఏర్పడటానికి, నిర్వహించడానికి సహాయపడుతుంది. రేగు చెట్టు దుఃఖాన్ని తొలగించేదిగా కూడా చెప్పబడింది.
రేగు పండ్లలో వున్న ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే... శరీరానికి చక్కటి పోషకాలు కావాలంటే రేగు పండ్లను తినాల్సిందే. రేగు పండ్లలో కొన్ని రకాలున్నాయి. వీటిలో చిన్న రేగు పండ్లు పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి.
అలాగే ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా వుండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినడం మంచిది.