రిఫైన్డ్ ఆయిల్ వద్దు.. ఉదయం ఫుల్‌గా లాగించాలి.. మధ్యాహ్నం, రాత్రి..?

బుధవారం, 13 జనవరి 2021 (12:18 IST)
Refined oil
ఆరోగ్యంగా వుండాలంటే.. ప్రాసెస్ చేసిన ఫుడ్‌ను పక్కనబెట్టాలి. రిఫైన్డ్ ఆయిల్ కార్బొహైడ్రేడ్స్ తయారుచేస్తాయి. అలాంటివి తినే బదులు... ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ బాగా ఉండేవి తినాలి. అంటే చేపలు, గుడ్లు తినవచ్చు. శాకాహారులైతే ఆవకాడో, క్యారెట్లు, పాలకూర వంటివి తినవచ్చు. బెర్రీస్, కమలాలు, దానిమ్మకాయలు అలాంటి పండ్లు తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.
 
సుగంధ ద్రవ్యాలు చాలా ఎక్కువ. ఆ స్పైసెస్‌లో మంచి రుచి మాత్రమే కాదు... ఆరోగ్యాన్ని కాపాడే చాలా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. సూక్ష్మక్రిములతో అవి పోరాడతాయి. అందువల్ల మనం వంటల్లో తప్పనిసరిగా పసుపు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు... ఇలాంటివి తప్పనిసరిగా వాడాలి.
 
అలాగే ఉదయం పూట నిద్ర లేచిన రెండు, మూడు గంటల్లో బ్రేక్ పాస్ట్ తినాలి. ఫాస్ట్‌గా కాకుండా బాగా నమిలి తినాలి. అలాగే కాస్త ఎక్కువగానే తినాలి. మధ్యాహ్నం కాస్త తక్కువ తినాలి. రాత్రికి ఇంకా తక్కువ తినాలి. అలాగే... ఆహారంలో ఫ్రూట్స్ ఉండేలా చేసుకోవాలి. ఆహారం తినే ముందు, తర్వాత ఓ గ్లాస్ నీరు తాగడం మర్చిపోవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు