మరీ అంత తెల్లగా వున్నవి తింటే అంతేసంగతులు.. ఇంతకీ ఏంటవి?

గురువారం, 6 ఆగస్టు 2020 (22:46 IST)
మల్లెపూవులంతా తెల్లగా వున్న ఆ పదార్థాలు తింటే అనారోగ్యం తప్పదని చెప్తున్నారు వైద్యులు. పాయిశ్చరైజర్ చేసిన పాలు బాగా తెల్లగా వుంటాయి. ఇలాంటి పాలను తాగితే అందులో ఉండే విటమిన్లు, ఎంజైమ్‌లు నాశనమై కేవలం 10 శాతం పోషకాలు మాత్రమే లభిస్తాయి. ఇలాంటి పాలు తాగితే మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
 
మరో సమస్యాత్మక పదార్థం రిఫైన్ చేయబడిన గోధుమపిండి లేదా మైదాపిండి. ఇందులో అల్లోగ్జాన్ అనే ప్రమాదకర రసాయనం కలుస్తుంది. ఇది క్లోమంలో ఉండే కణాలను నాశనం చేయడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
 
తీపి కోసం మనం నిత్యం వాడే చక్కెరను తయారీలో భాగంగా రిఫైన్ చేస్తారు. దీనివల్ల 90శాతం పోషక విలువలు లేకుండాపోతాయి. ఇటువంటి చక్కెరలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ మోతాదులో వుండటం వల్ల అది అనాగ్యాన్ని కలిగిస్తుంది. రిఫైన్ చేసిన ఉప్పు తింటే గుండె సంబంధ వ్యాధులు వస్తాయి.
 
తెల్లగా మల్లెపువ్వులా అన్నం వుండాలని బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తుంటారు. దీనితో ఫైబర్, ఇతర పోషకాలు నాశనమవుతాయి. ఈ బియ్యంతో వండిన అన్నం తింటే మధుమేహం వచ్చే అవకాశం వుందంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు