వీటిని తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయా?

మంగళవారం, 10 జులై 2018 (10:23 IST)
ఆధునిక జీవనశైలి ఆహార అలవాట్ల వలన అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ప్రపంచంలోని 18 శాతం మంది మహిళలు, 9.6 శాతం మంది పురుషులు కీళ్ళనొప్పులతో బాధపడుతున్నట్లు పలు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నారు. 60 ఏళ్లకు పైబడిని వ్యక్తుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు వెల్లడిస్తున్నారు.
 
రోజుకు ఒక గ్రామ్ చేప నూనె క్యాప్యూల్స్ తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గడంతోపాటు హృద్రోగ సమస్యలు కూడా నివారించవచ్చునని పేర్కొన్నారు. చేపనూనెలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు కీళ్ళవాపును తగ్గించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చును.
 
విటమిన్ కె అధికంగా కూరగాయలు, పాలకూర, కొత్తిమీర, క్యాబేజీలలో ఉంటుంది. కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా ఇవి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. తద్వారా కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఊబకాయం వలన కీళ్ళపై బరువు పడడంతో పాటు శరీరంలోని వ్యవస్థాపక మార్పులపై ప్రభావం చూపుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు