సాధారణంగా ఎక్కడా తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. తులసి ఆకులు, విత్తనాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు చివరి ప్రయత్నంగా ఆ వ్యక్తి నోటిలో తులసి ఆకురసం పోయడం తెలిసిన విషయమే.
తులసి ఆకు, విత్తనాలు యాంటి ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. దేహంలో తగినంత ఉష్ణోగ్రత ఉండేలా చూడడానికి తులసి ఆకుల రసం ఉపయోగపడుతుంది. తులసి విత్తనాల్లో ఐరన్, విటమిన్ కె, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్ కారణంగా రక్తవృద్ధి జరుగుతుంది.
సూర్యకిరణాల నుంచి విటమిన్ డి సంగ్రహించడానికి కూడా ఇది తోడ్పడుతుందట. ఫలితంగా ఎర్రరక్తకణాలు వృద్ధి చెందుతాయట. రక్తవృద్ధి, రక్తశుద్ధికి తులసి ఆకు, విత్తనాలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.