మామిడి గింజలులో దాగున్న ఆరోగ్య రహస్యాలు, ఏంటవి?

సిహెచ్

శనివారం, 6 ఏప్రియల్ 2024 (19:22 IST)
మామిడి చెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మామిడి ఆకులు, కాయలు, వాటి గింజలులో కూడా ఔషధీయ విలువలున్నాయి. మామిడి గింజలు మనకు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాము.
 
మామిడి గింజలు చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడతాయి
 
మామిడి గింజల నుండి టూత్ పౌడర్ తయారు చేయవచ్చు, ఈ పొడితో పళ్లు తోముకుంటే దంతాలు మిలమిలలాడుతాయి.
 
మామిడి గింజలను నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని 1-2 గ్రాముల మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే డయారియా తగ్గుతుంది.
 
మామిడి గింజల సారం ఊబకాయం, అధిక బరువును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
 
మామిడి విత్తనం రక్త ప్రసరణను పెంచి తద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
 
మామిడి గింజల మితమైన వినియోగం హృదయ సంబంధ వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
 
పొడి పెదాలను హైడ్రేట్ చేయడానికి, మృదువుగా చేయడానికి మామిడి గింజల వెన్నని సహజమైన లిప్ బామ్‌గా ఉపయోగించవచ్చు.
 
మామిడి గింజ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు