పెళ్లి చేసుకుంటేనే మీ గుండె పదిలంగా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకొనే తీరాలంటున్నారు. ఇంతకీ విషయమేంటే, పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామితో కలిసి ఉన్నవారు ప్రమాదకరమైన హృద్రోగాలబారిన పడే అవకాశం తక్కువగా ఉందని తాజాగా అధ్యయనంలో తేలింది. ఇందులోని ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిద్దాం.
* అలాగే, పెళ్లై జీవిత భాగస్వామితో విడిపోయిన వారు, ఒంటరిగా జీవించే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయట.
* పురుషుల్లో పోలిస్తే మహిళల్లో స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయట.
* ఈ పరిశోధన యూరోప్, ఉత్తర అమెరికా, మధ్య ఆసియా దేశాల్లో వివిధ జాతులకు, సంస్కృతులకు చెందిన వ్యక్తులపై జరిపారు.
* ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేతోడు ఉందనే భరోసా ఉన్నవారు మానసికంగా ఉల్లాసంగా ఉన్నారట.
* ఈ కారణంగానే స్ట్రోక్ బారి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.