డయాబెటిస్ రోగులకు దివ్యౌషధంగా పనిచేసే పుట్టగొడుగులు!

శనివారం, 16 జులై 2016 (12:13 IST)
పుట్టగొడుగులు డయాబెటిస్ రోగులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పుట్టగొడుగులు శరీరం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.  కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండుట వలన శరీరం ఫిట్ గా ఉండి రోగనిరోధకత పెరిగి మధుమేహం రాకుండా సహాయపడుతుంది. పుట్టగొడుగులు యాంటివైరల్‌గా ఉపయోగపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచటం వలన వైరల్ వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
 
పుట్టగొడుగులను మధుమేహం ఉన్న సమయంలో బరువును నియంత్రిస్తుంది. కొవ్వు కణాల నుండి హార్మోన్ స్రావం శరీరంలో రక్త గ్లూకోజ్‌ని ఉపయోగించుకోకుండా నిరోధిస్తాయి. పుట్టగొడుగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి బరువు నియంత్రణలో సహాయపడతాయి. వీటిలో విటమిన్ డి ఉండటం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది.
 
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రతి రోజు ప్రతి భోజనం మారుస్తూ ఉంటుంది. ఈ గ్లూకోజ్ స్థాయిలు రోజూ పెరగావచ్చు. తగ్గావచ్చు. డయాబెటిస్ నియంత్రణ లేకపోతే ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల వ్యాయామం చేస్తూ సమతుల్య ఆహారంను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందుకే మష్రూమ్ తీసుకుంటే చక్కెర స్థాయిల్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి