చలికాలంలో నడుము చుట్టు కొలత పెరగకుండా ఉండాలంటే.. మాంసంతో పాటు కాల్చిన క్యారెట్?

సోమవారం, 16 జనవరి 2017 (13:01 IST)
చలికాలంలో శారీరక శ్రమ లేకుంటే బరువు పెరగడం ఖాయం. కాబట్టి కొన్ని కూరగాయలను చలికాలంలో తీసుకుంటే బరువు అదుపులో పెట్టుకోవచ్చు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. శీతాకాలంలో వ్యాయామాలను పక్కనబెట్టడం.. పుష్ఠిగా కడుపును నింపేయడం చేస్తుంటాం. అలాంటి వారు మీరైతే ఈ చిట్కాలు పాటించండి. క్యాలీఫ్లవర్‌లో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని పోషకాలు క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. అందుకే చలికాలంలో కాలీఫ్లవర్ తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉండదు. 
 
తృణధాన్యాలు, మొలకలు తీసుకుంటే.. అదీ రాత్రి పూట ఒక కప్పు మొలకలను తీసుకుంటే శరీరానికి అవసరమైన ఎ, సి, కే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. చలికాలంలో నడుము చుట్టు కొలత పెరగకుండా ఉండాలంటే మాంసంతో పాటూ కాల్చిన క్యారెట్ ముక్కలను కూడా తీసుకోండి. శరీరానికి అందించే కేలరీల సంఖ్య తగ్గటమే కాకుండా, ఎక్కువ సమయం పాటూ పొట్ట నిండిన భావన కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి