భారతీయ ఆహార రకాలకు సంబంధించిన భారీ డేటాబేస్ నుంచి ఈ యాప్ డేటాను గణిస్తుంది. దేశమంతటినుంచి సేకరించిన 526 ఆహార రకాల నమూనాల్లోని 150 అంశాలకు సంబంధించి పోషకాహార సమాచారాన్ని ఈ డేటాబేస్ అందిస్తుంది. తాము ఏం తింటున్నామో ఖచ్చితంగా తెలుసుకోవాలని భావించే వారికి ఇది చాలా కీలకమైనదని సంస్థ డైరెక్టర్ లోంగావ్ తెలిపారు. మన పోషకాహార విధానాలను తీర్చిదిద్దడంలో కూడా ఇది తోడ్పడుతుందన్నారు.
ఈ డేటాబేస్‌లో తొలిసారిగా అమినో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ గురించిన వివరాలు పొందుపరుస్తున్నారు. ఇంగ్లీషుతో పాటు భారతీయ భాషలన్నింటిలో ఆహార సూచికను ఇది కలిగి ఉంటుంది. భారతీయ ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం, రిబోప్లోవిన్, నియాసిన్ వంటి పోషకపదార్థాలను ఈ డేటాబేస్ విశ్లేషిస్తుంది.