పచ్చి బఠాణీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి బఠాణీల్లో అల్జీమర్స్, ఆర్థరైటిస్ రోగాలను దూరం చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు.