ఇకపోతే.. కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ దాడి చేస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ వ్యాధి వస్తే 54 శాతం మరణాలు సంభవించే అవకాశం ఉందని వైద్యులు విశ్లేషిస్తున్నారు. మూడు రోజులు జ్వరం, జలుబు, తలనొప్పి, అస్థిరత, మానసిక గందరగోళం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. 24నుంచి 48గంటల్లో నిఫా వైరస్ వేగంగా వ్యాపించి రోగి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.