అలాగే ఆస్థియోపోరోసిస్ వ్యాధి ఉన్నవారు క్వినోవాని ఆహారంగా తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం, మాంగనీస్ ఉండడం వల్ల ఎముకలని బలోపేతం చేయడానికి సాయపడతాయి.
రక్త హీనతతో బాధపడేవారు వండిన క్వినోవాని ఆహారంగా తీసుకోవాలి. ఇందులో ఐరన్ ఉంటుంది. అది రక్తహీనతను తగ్గిస్తుంది. ఇంకా రైబోఫ్లేవిన్ ఉంటుంది కాబట్టి రక్తం పుట్టుకువస్తుంది. క్వినోవా చెడు కొవ్వును తగ్గిస్తుంది. దానివల్ల గుండె మీద భారం పడదు. అందువల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగవుతుంది.