రాగి దోసె తింటే ప్రయోజనాలు ఇవే

గురువారం, 22 జూన్ 2023 (20:42 IST)
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు.
 
రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి. ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు రాగి దోసెలను తింటుంటే తక్షణ శక్తి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు